ఏపీలో నేడు పిడుగులతో వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ

by velandi.Saikiran |

నేడు మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది.

ఏపీలో నేడు పిడుగులతో వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ వాసుల‌కు బిగ్ అల‌ర్ట్. నేడు మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది. ముఖ్యంగా అరకు, మడగడ, బాకూరు, అనంతగిరి, గజపతి నగరం, బొబ్బిలి, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఈ క్ర‌మంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

Next Story