Today's Horoscope: నేటి రాశి ఫలాలు.. శని దేవుని ఆశీస్సులు పొందే రాశులు ఇవే!

by Jakkula.Mamatha |

ఇవాళ(జూన్ 13) శనివారం నాటి గ్రహాల సంచారం ప్రకారం.. చంద్రుని సంచారం మరియు ఇతర ప్రధాన గ్రహాల వీక్షణల ఆధారంగా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Todays Horoscope: నేటి రాశి ఫలాలు.. శని దేవుని ఆశీస్సులు పొందే రాశులు ఇవే!
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారం రాశి చక్రములోని 12 రాశుల పై ప్రభావం చూపుతుంది. గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటే మరికొన్ని రాశులకు ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో ఇవాళ(జూన్ 13) శనివారం నాటి గ్రహాల సంచారం ప్రకారం.. చంద్రుని సంచారం మరియు ఇతర ప్రధాన గ్రహాల వీక్షణల ఆధారంగా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రాశి వారికి ఈ రోజు పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ, రాహు-కేతువుల ప్రభావం వల్ల మానసిక గందరగోళం ఉండవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. వ్యాపారంలో ఒడిదుడుకులు తట్టుకోవడానికి ప్రణాళిక ముఖ్యం. అనవసరపు వస్తువులపై ఖర్చులు పెరుగుతాయి. పొదుపు పై దృష్టి పెట్టండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.. తలనొప్పి లేదా కంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఇష్టదైవారాధన మేలు చేస్తోంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బాగుంది. ముఖ్యంగా గురు, శని గ్రహాల శుభ వీక్షణ వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథున రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహాల సంచారం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ మీ చతురతతో పనులను పూర్తి చేయగలుగుతారు. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి వాదనలకు దూరంగా ఉండండి. ఖర్చులు పెరిగినప్పటికీ, దానికి తగినట్లుగా రాబడి కూడా ఉంటుంది. ప్రయాణాల సమయంలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి

ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలమైన మార్పులను తీసుకొస్తుంది. మిత్రుల లేదా బంధువుల సహకారం వల్ల నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన లాభాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడులు లాభిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది, పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యుని గమనం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, అయితే శని వీక్షణ వల్ల కొన్ని పనులలో కష్టం తప్పదు. బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారంలో లాభాలు ఓ మోస్తరుగా ఉంటాయి. భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ముందడుగు వేస్తాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు ఉంటాయి.

కన్యా రాశి

గ్రహాల స్థితి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా బుధుని ప్రభావం వల్ల మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి, విద్యార్థులకు ఈ రోజు చాలా సానుకూలమైన రోజు. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కోసం దైవ దర్శనాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తులా రాశి

ఈ రాశి వారికి గ్రహ గోచారం వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి అసంతృప్తి వాతావరణం నెలకొనవచ్చు. పని ప్రదేశంలో ఓపిక చాలా అవసరం. తొందరపడి ఉద్యోగాలు మారే నిర్ణయాలు తీసుకోవద్దు. ఖర్చులు అధికంగా ఉంటాయి. బడ్జెట్ ప్రకారం నడుచుకోవడం మంచిది. సరైన సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు. గ్రహాల అనుకూలత వల్ల సమాజంలో మీ ఉనికి చాటుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా స్థానచలనం కోసం చూస్తున్న వారికి సానుకూల వార్తలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.

ధనస్సు రాశి

వీరికి ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. శని దేవుని ప్రభావం వల్ల పనులలో ఆటంకాలు ఎదురైనా, చివరికి విజయం మీదే అవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. శ్రమను నమ్ముకుని ముందడుగు వేయాలి. ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వవద్దు, తిరిగి రావడం కష్టమవ్వచ్చు. బంధువులతో మాట్లాడేటప్పుడు మాట తీరు పై నియంత్రణ అవసరం.

మకర రాశి

ఈ రాశి వారికి ఈ రోజు గ్రహాల సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. శని ప్రభావం సానుకూలంగా ఉండటం వల్ల మీలో పట్టుదల, క్రమశిక్షణ పెరుగుతాయి. పెండింగ్‌లో ఉన్న ఫైళ్లు, ప్రాజెక్టులు క్లియర్ అవుతాయి. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. పాత అప్పులు తీర్చగలుగుతారు. ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు.

కుంభ రాశి

గ్రహాల స్థితి మిశ్రమంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కొనసాగుతున్నందున, కష్టపడితేనే ఫలితాలు దక్కుతాయి. పని భారం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడికి లోనుకాకుండా ప్రణాళికాబద్ధంగా పనులు ముగించండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. పొదుపు వైపు మొగ్గు చూపడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

మీన రాశి

ఈ రాశి వారికి గ్రహ సంచారం సానుకూల మార్పులను సూచిస్తోంది. గురు గ్రహ అనుకూలత వల్ల శుభ పరిణామాలు ఎదురవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. శనివారం రోజు కాబట్టి హనుమాన్ చాలీసా పఠించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి శుభం జరుగుతుంది.

Next Story