- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ బీజేపీ మనిషా అని అనుమానం.. ఈటల సంచలన వ్యాఖ్యలు
ధాన్యం కొనుగోళ్లను, ప్రాజెక్టులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ చేసిన ఆరోపణలపై ఎంపీ ఈటల రాజందర్ స్పందించారు. హైదరాబాద్ లో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్త నుండి కేంద్రమంత్రి వరకు రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటాం తప్ప అడ్డుకునేది లేదని చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్: ధాన్యం కొనుగోళ్లను, ప్రాజెక్టులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ చేసిన ఆరోపణలపై ఎంపీ ఈటల రాజందర్ స్పందించారు. హైదరాబాద్‌లో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్త నుండి కేంద్రమంత్రి వరకు రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటాం తప్ప అడ్డుకునేది లేదని చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ మెప్పు కోసమే రేవంత్ రెడ్డి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి తమపై, ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కేంద్రం రూ.6,300 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని తెరిపించిందన్నారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కళను సాకారం చేసింది బీజేపీనే అని వ్యాఖ్యానించారు. ఉప్పల్‌లో కడుతున్న ఫ్లైఓవర్, ఎల్ బీనగర్‌లో కట్టిన ఫ్లైఓవర్, ఆరాంగడ్ ఫ్లైఓవర్ ఇవన్నీ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అని స్పష్టం చేశారు. చేసింది చెప్పుకునే కుసంస్కారం తమకు లేదని మండిపడ్డారు. కేంద్రం ఏం ఇచ్చిందో తెలియాలి అంటే రేవంత్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్ రావాలని అన్నారు. మీరు మాకు నిధులు ఇస్తున్నారు.. ఇంకా కావాలని ప్రధానిని అడగాలి కానీ విమర్శలు ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి లానే మాట్లాడాడని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మోడీని కలిసినప్పుడు ఒకలా ఢిల్లీకి వెళ్లొచ్చిన తరవాత మరోలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. మల్కాజ్ గిరికి మెట్రో వస్తే ఈటలకు పేరు వస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటారని చెప్పడం వార్తల్లో హెడ్ లైన్ గా మారేందుకేనని మండిపడ్డారు. మల్కాజ్ గిరికి మెట్రో వస్తే కిషన్ రెడ్డి చాలా సంతోషిస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆ భ్రమలో ఉండాల్సిన అవసరంలేదని చెప్పారు. ఇలాంటి చౌకబారు విమర్శలు రేవంత్ మానుకోవాలన్నారు. రేవంత్ బీజేపీ వ్యక్తా అని వాళ్ల హైకమాండ్‌కు అనుమానం ఉందని అందుకే వాళ్ల మెప్పుకోసం ఇలాంటి కామెంట్లు చేస్తాడని కౌంటర్ ఇచ్చారు.






