- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో దారుణం.. రూ.20 కోసం డ్రైవర్‌ను చంపిన యువకులు
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. రూ.20 రూపాయల కోసం ఇద్దరు యువకుడు ఓ డ్రైవర్‌ను హత్య చేశారు. ఈ ఘటన అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. రూ.20 రూపాయల కోసం ఇద్దరు యువకుడు ఓ డ్రైవర్‌ను హత్య చేశారు. ఈ ఘటన అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో చోటు చేసుకుంది. పాపంపేటలో శేఖర్ అనే వ్యక్తి కూరగాయ దుకాణం నిర్వహిస్తుండగా మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అతడి వద్దకు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. బిల్లు రూ.120 అవ్వగా యువకులు రూ.500 నోటు ఇవ్వడంతో శేఖర్ రూ.380 తిరిగి ఇచ్చాడు. ఇంకా రూ.20 ఇవ్వాలని యువకులు అడగటంతో వ్యాపారి ఇవ్వలేదు.
ఈ క్రమంలో మాటామాటా పెరిగి శేఖర్ పై యువకులు దాడి చేశారు. గోడవపెద్దిది కావడంతో పక్కనే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ బెస్త చంద్ర 55 జోక్యం చేసుకుని యువకులను సముదాయించి గొడవను ఆపాలని చూశాడు. కానీ మద్యం మత్తులో ఉన్న యువకుడు విచక్షణ లేకుండా అతడి ముఖం, ఛాతీపై పిడిగుద్దులతో దాడి చేశారు. దీంతో డ్రైవర్ చంద్ర అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. కేవలం రూ.20 విషయంలో జరిగిన గొడవతో యువకులు ఓ వ్యక్తి ప్రాణం తీయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.






