- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్సాంలో వాయుసేన విమానానికి ప్రమాదం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!
అస్సాంలోని జోర్‌హట్ ఎయిర్ బేస్‌లో ల్యాండైన తర్వాత భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 రవాణా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత వాయుసేన (IAF) కు చెందిన రవాణా విమానం ప్రమాదానికి గురైంది. అస్సాం రాష్ట్రంలోని జోర్‌హట్ (Jorhat) ఎయిర్ బేస్‌లో ఏఎన్-32 (AN-32) రకం వాయుసేన విమానం రన్‌వేపై ల్యాండైన తర్వాత ఒక్కసారిగా అందులో భారీగా మంటలు చెలరేగాయి. విమానం నుంచి దట్టమైన పొగలు, మంటలు రావడాన్ని గమనించిన ఎయిర్ బేస్ అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే వాయుసేనకు చెందిన ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు, విమానంలో ఉన్న సిబ్బంది క్షేమ సమాచారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదానికి గురైన ఈ 'ఏఎన్-32' విమానాలు భారత వాయుసేనలో అత్యంత కీలకమైనవి. ఇవి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, లడఖ్ లాంటి సరిహద్దు ఎత్తైన పర్వత ప్రాంతాలకు సైనికులను, భారీ రక్షణ సామగ్రిని చేరవేసే వ్యూహాత్మక రవాణా సేవలను అందిస్తుంటాయి.






