ఉధృతంగా ప్రవహిస్తున్న చౌటపల్లి వాగు.. నాలుగు గ్రామాలకు నిలిచిన రాకపోకలు!

by Jakkula.Mamatha |

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉధృతంగా ప్రవహిస్తున్న చౌటపల్లి వాగు.. నాలుగు గ్రామాలకు నిలిచిన రాకపోకలు!
X

దిశ,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అచ్చంపేట పట్టణంలోని మల్లంకుంట వద్ద ప్రధాన రహదారి చెరువులో తలపించింది. అలాగే ఎగువ నుంచి వస్తున్న చంద్ర సాగర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతోపాటు పట్టణ సమీపంలోని చౌటపల్లి వాగు స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

అలాగే పట్టణంలోని 9వ వార్డు ఆదర్శ కాలనీ నీటిలో మునగడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పట్టణంలో కాలనీలో సందర్శించారు. చౌటుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అచ్చంపేట పట్టణానికి లక్ష్మాపల్లి, చౌటపల్లి, బాణాల, బిల్లకల్లు గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చౌటపల్లి బ్రిడ్జి వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి దుస్థితికి కారణమని విమర్శించారు.

హైలెవెల్ బ్రిడ్జి కోసం మంత్రి సీతక్క దృష్టికి..

చౌటపల్లి బ్రిడ్జి వద్ద హై లెవెల్ వంతెన నిర్మాణం ఏర్పాటు కొరకు మంత్రి సీతక్కతో ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడి హై లెవెల్ వంతెన ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసి నివేదిక పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Next Story