చంకీలు పొదిగిన డ్రెస్‌లో నడుమందాలతో హీట్ పెంచుతున్న శృతిహాసన్

by Pulgam srinivas |

వైట్ అవుట్‌ఫిట్‌లో వావ్ అనిపిస్తున్న శృతి హాసన్.. హాట్ లుక్స్ వైరల్

చంకీలు పొదిగిన డ్రెస్‌లో నడుమందాలతో హీట్ పెంచుతున్న శృతిహాసన్
X

దిశ, వెబ్ డెస్క్: కెరీర్ ప్రారంభంలో వరుస అపజయాలను ఎదుర్కొని ‘ఐరన్ లెగ్ బ్యూటీ’ అనే ట్యాగ్‌ను ఎదుర్కొన్న శృతిహాసన్, ఆ తర్వాత ఒక్క సినిమాతో తన రేంజ్‌ను పూర్తిగా మార్చుకుంది.



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.




అంతటి క్రేజ్‌ను సంపాదించుకున్న శృతి, తన అందం, నటనతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ‘పెద్ది’ చిత్రంలోని స్పెషల్ సాంగ్‌లో కనిపించి తన స్టైలిష్ డ్యాన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది.




తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసిన శృతి, వైట్ కలర్ చంకీలు పొదిగిన స్టైలిష్ డ్రెస్‌లో గ్లామర్ టచ్ ఇచ్చింది. ట్రెండీ అవుట్‌ఫిట్‌కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్, ముఖంపై పడేలా వదిలిన కురులతో మరింత స్టైలిష్‌గా కనిపించింది.




ఈ లుక్స్‌లో శృతి ఎంతో ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story