- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్వా రైతుల ఉద్యమం ఉధృతం... రోడ్లపై నిరసనకు పిలుపు
ఆక్వా రైతుల ఉద్యమం ఉధృతమవుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఫీడ్ ధరలను పెంచింది. దీంతో ఆక్వారైతులు భగ్గుమన్నారు..

దిశ, వెబ్ డెస్క్: ఆక్వా రైతుల(Aqua Farmers) ఉద్యమం ఉధృతమవుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం(Government) ఫీడ్ ధరల(Feed Prices)ను పెంచింది. దీంతో ఆక్వారైతులు భగ్గుమన్నారు. ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధరల పెంపు వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు.
ప్రభుత్వానికి అల్టిమేటం
దీంతో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమావేశమైన ఆక్వా రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాలని నిర్ణయించారు. ఫీడ్ ధరలు తగ్గించకపోతే చలో అమరావతి సైతం చేపట్టేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. తమ సమస్యలు తెలుసుకోకుండానే ఫీడ్ ధరలను ప్రభుత్వం పెంచిందని, ఇప్పటికైనా తమ పోరాటాన్ని అర్ధం చేసుకోవాలని ఏపీ ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు గాంధీ భవన్ రాజు సూచించారు. కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి ధరలు తగ్గంచాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 16న రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తామని గాంధీ భవన్ రాజు హెచ్చరించారు.






