- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి పై ఉక్కుపాదం.. యువత తప్పుదారి పట్టొద్దు : సీఐ ముత్యం రమేష్
మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.

దిశ, వెంకటాపురం (నూగూరు) : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తూ, విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ముత్యం రమేష్ మాట్లాడుతూ మండల పరిధిలోని రామచంద్రపురం సమీపంలో కొందరు గంజాయి విక్రయాలు చేస్తూ, సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందిందన్నారు. సమాచారం మేరకు ఎస్సై కొప్పుల తిరుపతిరావు తన సిబ్బందితో కలిసి జామాయిల్ తోట ప్రాంతంలో ముందస్తుగా నిఘా ఏర్పాటు చేశారని తెలిపారు.
అదే సమయంలో ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు, ఒక ద్విచక్ర వాహనం పై మరో వ్యక్తి అక్కడికి చేరుకోగా అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. ఈ విచారణలో వీరభద్రవరం గ్రామానికి చెందిన మంచర్ల అనిల్, కుర్సం సంతోష్ కుమార్, అలాగే రామచంద్రపురం గ్రామానికి చెందిన ఉయిక సురేష్‌గా గుర్తించినట్లు తెలిపారు. గంజాయి విక్రయాలు, సేవనం జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం ఉండటంతో పంచుల సమక్షంలో తనిఖీలు నిర్వహించగా వారి వద్ద నుంచి 23 గ్రాముల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల పై కేసునమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు. మండలంలో గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించిన సీఐ, గంజాయికి దూరంగా ఉండి యువత తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాలు లేదా అక్రమ కార్యకలాపాల పై సమాచారం అందించిన వారికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు.






