నటీనటులు కంటెంట్‌ను ఎంచుకోవడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారనేది ఒక అపోహ మాత్రమే: పార్వతి తిరువోతు

by Mallepaka Hamsa |

సాధారణంగా నటీనటులు కంటెంట్‌ను ఎంచుకోవడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారనేది ఒక అపోహ మాత్రమే అని స్పష్టం చేసింది.

నటీనటులు కంటెంట్‌ను ఎంచుకోవడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారనేది ఒక అపోహ మాత్రమే: పార్వతి తిరువోతు
X

దిశ, సినిమా: మలయాళ ముద్దుగుమ్మ పార్వతి తిరువొతు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం సినిమాలే కాకుండా, సమాజంలోనూ, పరిశ్రమలోనూ జరిగే విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. 2024లో విక్రమ్ సరసన ఆమె నటించిన ‘తంగలాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె ‘నోబడీ’ అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా వచ్చే జూలై నెలలో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో, ప్రమోషన్లలో భాగంగా తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పార్వతి సినీ పరిశ్రమలోని అసలు వాస్తవాలను బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఒక నటిగా తనకు ఉన్న స్వేచ్ఛకు, అలాగే అక్కడ వాస్తవంగా జరిగే పనులకు మధ్య చాలా తేడా ఉందని పార్వతి ఎత్తి చూపింది. సాధారణంగా నటీనటులు కంటెంట్‌ను ఎంచుకోవడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారనేది ఒక అపోహ మాత్రమే అని స్పష్టం చేసింది.

నటీనటులుగా తమకు పరిశ్రమ నుండి వచ్చే పాత్రలనే తాము అంగీకరించాల్సి వస్తుందని ఆమె తెలిపింది. తమకు వచ్చిన ఆ కొద్దిపాటి అవకాశాల్లోనే బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వడానికి, ఆ పాత్రలను ఉత్తమంగా మలచడానికి తాము శ్రమిస్తామని వివరించింది. పరిశ్రమలో ఒక స్థాయికి వచ్చిన నటీనటులకు ఎల్లప్పుడూ ఆడిషన్స్ ఇచ్చే అవకాశం ఉండదని పార్వతి తెలిపింది. అందుకే దర్శకులే తమను ఒక కొత్త కోణంలో ఊహించుకోవాలని ఆమె కోరింది. తాము గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా, తమను సరికొత్తగా చూపించే పాత్రలను దర్శకులు తమకు ఇస్తారని తాము వారిపైనే ఆధారపడతామని చెప్పింది. నిజ జీవిత స్ఫూర్తితో కూడిన పాత్రలను, కల్పిత పాత్రలను సమతుల్యం చేసుకునే అదృష్టం తనకు దక్కినప్పటికీ.. పరిశ్రమలో చాలామంది నటీనటులకు, ముఖ్యంగా మహిళా నటీమణులకు ప్రజలు ఊహించిన దానికంటే చాలా తక్కువ అవకాశాలు వస్తాయని వెల్లడించింది. ఆ కొద్దిపాటి పరిమిత అవకాశాల్లోనే ప్రతి పాత్రను సద్వినియోగం చేసుకుంటూ తాము నిరూపించుకోవాల్సి వస్తోందని పార్వతి సినీ పరిశ్రమలోని మహిళా నటుల పరిస్థితిని వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story