- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయ్‌పూర్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
ఢిల్లీ నుంచి రాయ్‌పూర్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి మంగళవారం ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నుంచి రాయ్‌పూర్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి మంగళవారం ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొట్టింది. రన్‌వేపై దిగేందుకు విమానం చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రాయ్‌పూర్ విమానాశ్రయ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.పక్షి ఢీకొన్న వెంటనే పైలట్లు భద్రతా నిబంధనల ప్రకారం అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్‌వోపీ) అమలు చేశారు. అనంతరం విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి, సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాత తదుపరి ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రమాదం తప్పినట్లైంది.
వరుస ఘటనలు..
ఇటీవలి కాలంలో విమానాలకు ఇలాంటి అంతరాయాలు ఎదురవ్వడం ఇది మొదటిసారేం కాదు. జూన్ 8న ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యాంగర్‌లో నిలిపి ఉంచిన మూడు ఎయిర్ ఇండియా విమానాలు భారీ ఈదురు గాలుల కారణంగా దెబ్బతిన్నాయి. అంతకుముందు పోయిన శుక్రవారం కూడా బెంగళూరు నుంచి ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొట్టడంతో, పైలట్ అప్రమత్తమై తిరిగి విమానాన్ని బేకి తరలించారు. తనిఖీల అనంతరం గంటన్నర ఆలస్యంగా ఆ విమానం బయలుదేరింది.






