- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్.. ఇంట్రో సాంగ్‌కు రాజు సుందరం
“డ్రాగన్” చిత్రంలో మాస్ ఇంట్రో సాంగ్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న “డ్రాగన్” చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో అదిరిపోయే ఇంట్రో సాంగ్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ట్యూన్‌ను సంగీత దర్శకుడు రవి బస్రూర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది అద్భుతంగా వచ్చిందని, ఇది ఒక మాస్ డ్యాన్స్ నెంబర్‌గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ పాటకు కొరియోగ్రఫీ కోసం రాజు సుందరం మాస్టర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఈ సాంగ్‌ను శ్రీలంకలో చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో ఎన్టీఆర్ పూర్తిగా మాస్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. దీంతో ఈ సాంగ్‌పై తారక్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించనుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ నటుడు అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.






