- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సును నడిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు
మహిళ సమైక్య బస్సు ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, అనంతరం నడిపారు.

X
దిశ, చిన్నంబావి: మండల కేంద్రంలోని మహిళా సమైక్య బస్సును రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఈ బస్సులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడం, వారికి రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. అనంతరం బస్సును ప్రారంభించి మహిళలు, కార్యకర్తలతో కలిసి బస్సు లో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కిమ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి, బిచూపల్లి యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు, మహిళా సమైక్య సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.
Next Story






