- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు శుభవార్త.. వరికపుడిసెల ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పల్నాడు జిల్లా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పల్నాడు మెట్ట ప్రాంతాల సాగునీటి కల సాకారం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వరికపుడిసెల ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ నెట్‌వర్క్ పనులను వేగవంతం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది..

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా(Palnadu District) రైతుల(Farmer)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పల్నాడు మెట్ట ప్రాంతాల సాగునీటి కల సాకారం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వరికపుడిసెల ఎత్తిపోతల పథకం(Varikapudisela Lift Irrigation Scheme) పైప్‌లైన్ నెట్‌వర్క్ పనులను వేగవంతం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పరిధిలోని భూసేకరణ పనులకు రూ. 63.14 కోట్లు నిధులు కేటాయించింది. వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ పనులు పూర్తి అయితే వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లో పైప్‌లైన్ ద్వారా సాగునీటి సరఫరా చేయనున్నారు.
రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. పల్నాడు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు విశ్రమించమని ఆయన హామీ ఇచ్చారు. పల్నాడు రైతుల కల వరికపుడిసెల ప్రాజెక్టును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.






