- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలుష్య నియంత్రణకు ముందడుగు.. కాలినడకన కోర్టుకు జడ్జి
by Taduka Kalyani |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి బుధవారం తన ఇంటి నుంచి కాలినడకన కోర్టుకు వెళ్లారు.

X
దిశ, ఆసిఫాబాద్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి బుధవారం తన ఇంటి నుంచి కాలినడకన కోర్టుకు వెళ్లారు. ఇంధన పొదుపు కాలుష్య నియంత్రణలో భాగంగా ఆమె అధికారిక వాహనం పక్కన పెట్టి ఇలా కాలినడకన కోర్టుకు వెళ్లారు. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఇంధన కొరతను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఆమె సూచించారు. అలాగే శారీరక శ్రమ తగ్గిపోతున్న ఈ రోజుల్లో కాలినడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. అధికారిక వాహనాన్ని పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణకు జడ్జి ఇలాంటి నిర్ణయాలు తీసుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Next Story






