- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 25 నుంచి నెల రోజుల పాటు ఓటర్ మ్యాపింగ్
ఈ నెల 25 నుంచి నెల రోజుల పాటు చేపట్టనున్న ఓటర్ మ్యాపింగ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో మంద మకరందు పిలుపునిచ్చారు.

దిశ, బీంపూర్: ఈ నెల 25 నుంచి నెల రోజుల పాటు చేపట్టనున్న ఓటర్ మ్యాపింగ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీడీఏ పీవో మంద మకరందు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో తాంసి, బీంపూర్ మండలాల బీఎల్వోలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లకు నిర్వహించిన ఎస్ఐఆర్-2026 శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీంపూర్ తహసీల్దార్ రమేష్ నాయక్, తాంసి తహసీల్దార్ లక్ష్మితో పాటు బీఎల్వోలు, బీఎల్ఏలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మంద మకరందు మాట్లాడుతూ, "ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో స్పెషల్ సమ్మరీ రివిజన్ చేపడతాం. కానీ ఈసారి ప్రత్యేకంగా అర్హులైన ఎవరూ ఓటర్ లిస్టు నుంచి మిస్ కాకుండా, అనర్హులు ఎవరూ లిస్టులో ఉండకుండా తొలగించేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాం. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి" అని అన్నారు."కేవలం బీఎల్వోలు మాత్రమే కాకుండా బీఎల్ఏలు, వివిధ కమ్యూనిటీలు, సర్పంచులు, పటేళ్లు, గ్రామ పెద్దలు అందరూ ఇన్వాల్వ్ అయితేనే పక్కా వెరిఫికేషన్ జరుగుతుంది. బీఎల్వోల రిప్రజెంటేషన్ మాత్రమే ఉంటే ఎలక్షన్ టైంకు ఇబ్బందులు వస్తాయి" అని సూచించారు.జూన్ 25 నుంచి ఒక నెల పాటు బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ చేస్తారని పేర్కొన్నారు. ఓటరు మ్యాపింగ్‌ను విజయవంతం చేయాలని కోరారు.






