లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం

by Taduka Kalyani |

లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.

లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం
X

దిశ, ఆసిఫాబాద్: లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, ఆస్తి విభజన వివాదాలు, కుటుంబ, వైవాహిక సమస్యలతో పాటు బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ తదితర రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కోర్టు విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. కేసుల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఈ నెల 20న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. దీని ద్వారా బాధితులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.

Next Story