ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ను అడ్డుకున్న గ్రామస్థులు

by velandi.Saikiran |

ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ను గ్రామస్థులు అడ్డుకున్నారు. మండలంలోని నంచర్ల గ్రామంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ను అడ్డుకున్న గ్రామస్థులు
X

దిశ, పెగడపల్లి: ప్రైవేట్ పాఠశాల వద్దు ప్రభుత్వ పాఠశాలే ముద్దు అంటూ పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా గ్రామంలోకి వచ్చిన ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ను పంచాయతీ పాలక వర్గంతో కలిసి గ్రామస్థులు అడ్డుకున్నారు. మండలంలోని నంచర్ల గ్రామంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కుంటాల వనజ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ బడుల్లోనే ఉచిత నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ప్రజలు అప్పులు చేసి తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ఎడ్ల శ్యాం సుందర్ రెడ్డి,అంగన్వాడీ టీచర్స్ పద్మ,ఉమారాణి,వనిత, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story