- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేమంతా పవన్ కల్యాణ్ కొడుకులమా? మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్, మంత్రి వంగలపూడి అనిత ఎపిసోడ్ పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. గతంలో టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడిన వీడియోలను చూపిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత గుడివాడ అమర్ నాథ్, మంత్రి వంగలపూడి అనిత ఎపిసోడ్ పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. గతంలో టీడీపీ, జనసేన నాయకులు మాట్లాడిన వీడియోలను చూపిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ కల్యాణ్.. ఆడ కాదు మగ కాదు ఒక్కొక్కరిని తొక్కిపట్టి నారతీస్తా.. ఎంత మంది వస్తారో రండి కొడకల్లారా.. అంటూ మాట్లాడిన వీడియోను ప్రదర్శిస్తూ .. మేం అంతా పవన్ కల్యాణ్ కొడుకులమా అంటూ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మాట్లాడింది సంస్కారవంతమైన భాషనా అని అడిగారు. అమర్నాథ్ పై 10 నుండి 15 కేసులు పెట్టబోతున్నట్టు తమకు తెలిసిందన్నారు. ఎన్ని కేసులైనా పెట్టండి... ఎక్కడికైనా తిప్పండని ఎవరినీ ఏం చేయలేరన్నారు.
అరెస్ట్ చేస్తే అమర్నాథ్ ఇంకా పెద్ద నాయకుడు అవుతాడని అన్నారు. పవన్ కల్యాణ్ కు మంత్రి పదవి తరవాత సంస్కారం వచ్చిందా అని ప్రశ్నించారు. పార్టీ పెట్టిందే సుగాలి ప్రీతి కోసం అని ఆ విషయాన్ని పవన్ వాడుకున్నాడని అన్నారు. హొంమంత్రి అనితమ్మను అమాయకురాలిని చేసి చేశాడని ఆరోపించారు. అసలు హోం మంత్రి కట్టుబొట్టు గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ కు ఆంధ్రాలో ఏం జరిగినా వినిపించదు కనిపించదని అన్నారు. ఆంధ్రాలో ఓ తల్లి నా కొడుకు కనిపించడంలేదని ఏడ్చినా పట్టించుకోవడంలేదని, తెలంగాణలో ఎవరో అనారోగ్యంతో ఉన్నారని తెలియగానే వస్తున్నా అంటూ వెళ్లి పరామార్శిస్తున్నాడని విమర్శించారు.






