- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ. లక్ష చెక్కు
అనారోగ్యంతో మరణించిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో రూ.1,00,000 చెక్కును అందజేశారు.

దిశ, కొత్తగూడెం: జిల్లా ఆర్మడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఇటీవల మరణించిన ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ మహమూద్ కుటుంబానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం తన కార్యాలయంలో రూ.1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విధి నిర్వహణతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం అవసరమని అన్నారు. మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రయోజనాలు, ప్రతిఫలాలు త్వరితగతిన కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాలయ ఏవో మంజ్యా నాయక్, పోలీస్ అధికారుల సంఘం సభ్యుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






