నేను రౌడీయిజం చేస్తే తట్టుకోలేరు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్

by Vemula.Srinu Prasad |

నెల్లూరులో రాజకీయ వేడి కొనసాగుతోంది. జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి దంపతులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు...

నేను రౌడీయిజం చేస్తే తట్టుకోలేరు: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు(Nellore)లో రాజకీయ వేడి(Political Heat) కొనసాగుతోంది. జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి దంపతులు(Mp Vemireddy Couples) చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై వైసీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. అయితే గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపుతూ కూటమి నేతలు సైతం స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరులో ఫ్లెక్సీల తొలగింపు వివాదం మరింత రాజుకుంది. అధికార పార్టీ చేపట్టిన కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలను నియోజకవర్గంలో కట్టారు. అయితే అంతకుముందే ఉన్న వైసీపీ నేతల ఫ్లెక్సీలను టీడీపీ నేతలు తీసివేసినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంచిది కాదు:

తమ ఫ్లెక్సీలను తీసివేయడం, దాడులకు పాల్పడటం వంటి మంచిదికాదని ఆయన హెచ్చరించారు. తాము రౌడీయిజం చేస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. అంతేకాదు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. గతంలోనూ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆయన ఘాటు వ్యా్ఖ్యలు చేశారు. అప్పటి నుంచి నెల్లూరు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు సైతం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డైరెక్ట్‌గా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు టీడీపీ నేతల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Next Story