- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాడిపడేసిన కలర్ డబ్బాల వద్ద సీఎం శిలాఫలకాలు!
ట్రిపుల్ ఐటీ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల శిలాఫలకాలు ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి.

దిశ-మహబూబ్‌నగర్: జిల్లా పరిధిలోని చిట్టబోయిన్‌పల్లి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా, సుమారు రూ.300 కోట్ల భారీ వ్యయంతో శంకుస్థాపన చేసిన ట్రిపుల్ ఐటీ ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజ్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాల శిలాఫలకాలు ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పాలమూరు ప్రాంత విద్యా రంగాన్నే సరికొత్త మలుపు తిప్పుతాయని భావించిన ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను అత్యంత భద్రంగా ఉంచాల్సింది పోయి, బాధ్యతారాహిత్యంగా పాలమూరు యూనివర్సిటీలోని అకడమిక్ బిల్డింగ్‌కు తరలించారు.
అక్కడ ఏ మాత్రం గౌరవం లేకుండా, వాడి పారేసిన రంగుల డబ్బాలు,చెత్తాచెదారం మధ్య నిర్లక్ష్యంగా పడేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఈ ఘోర అవమాన దృశ్యాలను చూసిన స్థానిక విద్యార్థులు,మేధావులు మరియు ప్రజా సంఘాల నాయకులు అధికారుల నిర్లక్ష్య తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల నిధుల విద్యా ప్రాజెక్టులకు సంబంధించిన ఈ ముఖ్యమైన శిలాఫలకాలను తక్షణమే అక్కడి నుంచి తొలగించి, గౌరవప్రదమైన స్థానంలో భద్రపరచాలని పలువురు కోరుతున్నారు.






