- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూత బడిన పాఠశాలకు జీవం పోసి ఆదర్శంగా నిలిచిన రామగిరి ప్రజలు
మూత బడిన ప్రభుత్వ పాఠశాలను సర్పంచ్, గ్రామస్తులు పునః ప్రారంభించారు.

దిశ, శాలిగౌరారం: రామగిరి గ్రామ ప్రజలు ఆదర్శంగా నిలిచి ఔరా అనిపించుకున్నారు. రెండు సంవత్సరాల క్రితం మూత బడిన తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని విశ్వ ప్రయత్నం చేశారు. సర్పంచ్ చాడ చంద్రకళ-హతీష్ రెడ్డి చొరవతో ఇంటింటికి తిరుగుతూ, ఉపాధి హామీ ప్రదేశాల వద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు, నాణ్యమైన బోధనతో పాటు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన సదుపాయం ఉందని విద్యార్థుల తల్లితండ్రులకు తెలిపారు. ప్రభుత్వ బడుల్లో చదివిన వారే ఉన్నత పదవుల్లో ఉన్నారని, మీ పిల్లలందరినీ మన పాఠశాలకు పంపించాలని కోరారు. గ్రామస్తుల కృషి, సర్పంచ్ చొరవతో కదిలిన రామగిరి ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తామని ఒప్పుకోవడంతో బుధవారం ప్రభుత్వ పాఠశాలను పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరమేష్, అంగన్వాడీ టీచర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






