- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీకి బిగ్ అలర్ట్.. మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షం
ఏపీలో మరో ముడు గంటల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే కొన్ని ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో మరో ముడు గంటల్లో పలు చోట్ల పిడుగుల(Thunderstorms)తో కూడిన వర్షం(Rain) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరించింది. అలాగే కొన్ని ప్రాంతాలకు రెడ్ అలెర్ట్(Red Alert) జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మరోవైపు తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించింది. అలాగే భారీ వర్షాలు పడే సమయంలో లోతట్టు ప్రాంతాల్లో ఉండరాదని తెలిపింది. పుసరావాసాలకు వెళ్లాలని సూచించారు. అటు అధికారులు సైతం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.






