ఆ విషయంలో మీనాక్షికి రేవంత్‍కు మధ్య పంచాయితీ..కేటీఆర్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ విషయంలో మీనాక్షికి రేవంత్‍కు మధ్య పంచాయితీ..కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్‍పై రేవంత్ రెడ్డి పగబట్టారని ఆరోపించారు. హైడ్రా పేదల ఇళ్లు కూల్చడంపై రేవంత్ రెడ్డికి మీనాక్షికి మధ్య పంచాయితీ నడుస్తోందని అందువల్ల ఆమెపై పగబట్టీ నామినేషన్ తిరస్కరించేలా రేవంత్ చేశారని ధ్వజమెత్తారు. ఇవాళ వేములవాడలో పర్యటించిన కేటీఆర్.. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. మీనాక్షిపై లేని కేసు గురించి రేవంత్ బీజేపీకి సమాచారం ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి హామీలు పెక్కన పెట్టారన్నారు.

అందుకే రాహుల్ రేవంత్ విషయంలో మౌనం:

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కానీ కేసీఆర్ అప్పు చేసి రూ. 200 పెన్షన్ రూ. 2 వేలకు పెంచినట్లు చెప్పారు. పదేళ్లలో రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు జమ చేశారన్నారు. రూ. 4 లక్షల కోట్ల అప్పులు చేసి రేవంత్ ఒక్క మంచి పని చేశారా అని నిలదీశారు. సొంత పార్టీ వాళ్లకే న్యాయం చేయలేని రేవంత్.. రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? అని విమర్శించాడు. కాంగ్రెస్ పార్టీలో పైసలకు పోస్టులు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ చెప్పాడు. డబ్బులు తీసుకొని సీఎం పోస్ట్ ఇచ్చిండు కాబట్టే రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని ఏం చేయలేకపోతున్నారని ఫైర్ అయ్యారు.

Next Story