ఉపాధి హామీ కూలీల పెళ్లి తంతు..

by Kodari Anjali |

ఇవాళ ఓ దంపతులది పెళ్లి రోజు కావడంతో ఉపాధి హామీ పని విరామం సమయంలో తోటి కూలీలు వారికి పెళ్లి దండలు మార్పించి వేడుకలు జరిపించారు.

ఉపాధి హామీ కూలీల పెళ్లి తంతు..
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులలో పెళ్లి సందడి నెలకొంది. అదే గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలైన ఆకుల శ్రీను దుర్గ దంపతులది శనివారం పెళ్లిరోజు కావడంతో.. పనుల విరామ సమయంలో సహచర కూలీలు వారి పెళ్లి తంతు జరిపారు. నుదుటన బాసికాలు కట్టి, డప్పు వాయిస్తూ, దంపతులిద్దరితో పూలదండలు మార్పించి మళ్ళీ పెళ్ళి చేశారు. ఆహ్లాదకరంగా జరిగిన ఈ వేడుక కనుల విందుగా సాగింది. కష్టజీవులు అంతా కలిసి జరిపిన పెళ్లి రోజు ఆనందోత్సాహాల మధ్య జరిగింది.

Next Story