- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు ‘బండి’ బంపర్ ఆఫర్..టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు
కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల టెన్త్ విద్యార్థులందరికీ 'మోదీ గిఫ్ట్' కింద ఉచితంగా సైకిళ్లు అందిస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా ‘మోదీ గిఫ్ట్’ (Modi Gift) పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో 10వ తరగతి చదివే విద్యార్థిని, విద్యార్థులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో పాటు పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, టెన్త్ క్లాస్ బోర్డు పరీక్ష ఫీజును కూడా తానే స్వయంగా చెల్లిస్తానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు.
సొంత జీతంతో పరీక్ష ఫీజులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో అత్యధికులు పేద, కార్మిక కుటుంబాలకు చెందినవారేనని, కనీసం పరీక్ష ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులను తాను చూశానని బండి సంజయ్ పేర్కొన్నారు. అందుకే తన సొంత జీతం డబ్బుల నుండి నియోజకవర్గంలోని దాదాపు 12 వేల మందికి పైగా టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిపారు. అలాగే, దూర ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థుల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో వేలాది సైకిళ్లను కొనుగోలు చేసి పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
ఒక ఎంపీగా గెలిచిన తర్వాత తన నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూల్ పిల్లల బాధ్యతను ఈ స్థాయిలో భుజానికెత్తుకోవడం దేశంలోనే ఇదే తొలిసారి అని ఆయన అనుచరులు చెబుతున్నారు. మంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలోని కరీంనగర్ లోక్‌సభ స్థానానికి చెందిన వేలాది మంది పేద విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.






