హారర్ థ్రిల్లర్‌తో భయపెట్టేందుకు సిద్ధమైన లేడీ సూపర్ స్టార్.. ‘కాంచన-4’లో కీలక పాత్ర!

by Mallepaka Hamsa |

రాఘవ లారెన్స్ హీరోగా ‘కాంచన-4’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్ర కోసం చిత్ర యూనిట్ నయనతారను సంప్రదించినట్లు సమాచారం.

హారర్ థ్రిల్లర్‌తో భయపెట్టేందుకు సిద్ధమైన లేడీ సూపర్ స్టార్.. ‘కాంచన-4’లో కీలక పాత్ర!
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస చిత్రాలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే ఆమె టాక్సిక్, హాయ్, మూక్కుత్తి అమ్మన్-2 వంటి సినిమాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంలోనూ నయనతార హీరోయిన్‌గా చాన్స్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నయనతారకు సంబంధించిన సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. భారతీయ చలనచిత్ర రంగంలోనే అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీగా గుర్తింపు తెచ్చుకున్న ‘ముని’ సిరీస్‌లో భాగంగా.. రాఘవ లారెన్స్ హీరోగా ‘కాంచన-4’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్ర కోసం చిత్ర యూనిట్ నయనతారను సంప్రదించినట్లు సమాచారం.

కథ, తన పాత్రలోని వైవిధ్యం నచ్చడంతో నయనతార కూడా ఈ హారర్ థ్రిల్లర్‌లో నటించేందుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. రాఘవ లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు వీరితో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రంలో నయనతార పాత్ర సినిమాను మలుపు తిప్పే విధంగా సరికొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ‘కాంచన’ సిరీస్‌కు ప్రధాన బలమైన సీనియర్ నటి కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్లతో పాటు ప్రముఖ కామెడీ నటుడు రెడిన్ కింగ్స్లీ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ పూర్తి చేసుకుని సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్న ‘కాంచన-4’లో నయనతార ఎంట్రీ ఇవ్వడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story