ఓయూలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-13 06:51:26  IST  )

ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట నిజాం కాలేజ్ విద్యార్థులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు.

ఓయూలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన
X

దిశ, సికింద్రాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట నిజాం కాలేజ్ విద్యార్థులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. హాస్టళ్లను వెంటనే ప్రారంభించి విద్యార్థులు ఎదుర్కొంటున్న వసతి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. హాస్టళ్లు మూసివేయడంతో అనేక మంది విద్యార్థులు వసతి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చదువులతో పాటు రోజువారీ జీవనం కూడా ప్రభావితమవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అద్దె గదుల్లో అధిక ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే స్పందించి హాస్టళ్లను పునఃప్రారంభించాలని, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Next Story