- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Drishyam 3 OTT release : ఓటీటీలోకి రాబోతున్న క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం-3’
విడుదలైన నెలరోజులకే దృశ్యం-3 డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన మైండ్‌బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం’. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ చిత్రాలు అన్ని భాషల్లోనూ రీమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రేజీ సిరీస్‌కు కొనసాగింపుగా మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూడో భాగం ‘దృశ్యం-3’ లో మోహన్ లాల్, మీనా జంటగా నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మలయాళంతో పాటుగా తెలుగులోనూ మే 21న విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను రాబట్టుకుంది. అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. విడుదలైన నెలరోజులకే దృశ్యం-3 డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. జూన్ 18 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు టాక్. థియేటర్లలో ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మిస్ అయిన వారు, జార్జ్‌కుట్టి ఈసారి పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నాడో తెలుసుకోవాలనుకునే సినీ ప్రియులు ఈ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ఫుల్ ఖుషీ అవుతున్నారు.
‘డ్రాగన్’ సినిమాకు డైరెక్షన్ చేయడంపై రియాక్ట్ అయిన దేవ కట్టా… వైరల్‌గా మారిన పోస్ట్






