- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డ్రాగన్’ సినిమాకు డైరెక్షన్ చేయడంపై రియాక్ట్ అయిన దేవ కట్టా… వైరల్‌గా మారిన పోస్ట్
కేవలం క్లిక్స్ కోసం, వ్యూస్ కోసమే కొందరు పనిగట్టుకుని మరీ ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన రూమర్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ దేవకట్టా ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారని, అంతేకాకుండా ‘డ్రాగన్’లోని ఒక కీలకమైన సీన్‌ను కూడా ఆయనే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడిచింది. తాజాగా, ఈ విషయంపై డైరెక్టర్ దేవ కట్టా ట్వి్ట్టర్ ద్వారా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. కేవలం క్లిక్స్ కోసం, వ్యూస్ కోసమే కొందరు పనిగట్టుకుని మరీ ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తాను వేరే ఏ సినిమాకు సంబంధించిన ఒక్క షాట్ కూడా డైరెక్టర్ చేయడం లేదని అన్నారు. ఇలాంటి రూమర్స్ కేవలం వెబ్‌సైట్ క్లిక్స్ కోసం క్రియేట్ చేసినవని, ఇవి చాలా చౌకబారు ప్రచారాలని కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను చేస్తున పనుల గురించి చెబుతూ.. తన తదుపరి సినిమా స్క్రిప్ట్ వర్క్ అండ్ డెవలప్‌మెంట్ బిజీగా ఉన్నట్లు వెల్లడించారు. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ సినిమా కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌పై తనకు ఎంతో నమ్మకం , ఉత్సాహం ఉన్నాయని .. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను తానే అధికారికంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. దేవకట్టా ఇచ్చిన ఈ ఘాటు సమాధానంతో ‘డ్రాగన్’ సినిమాపై వస్తున్న పుకార్లకు పూర్తిగా బ్రేక్ పడినట్లయింది.






