- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమ్స్ ఆస్పత్రిలో కలకలం.. బాలికపై లైంగిక దాడికి యత్నం
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి నిర్మాణ భవనం వద్ద ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు.

దిశ, ఖైరతాబాద్ : హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో ఓ బాలికపై లైంగిక దాడి (Sexual assault)కి యత్నించిన ఘటన కలకలం రేపింది. పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం.. నిమ్స్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద పనులు చేస్తున్న ఓ కుటుంబం తాత్కాలికంగా నివాసం ఉంటోంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఆ కుటుంబానికి చెందిన బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఓ వ్యక్తి ఆమెను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసి లైంగిక దాడికి యత్నించినట్లు సమాచారం. అయితే బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోగా, నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ప్రాథమిక విచారణలో నిందితుడు శంభు బండారిగా పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో బాలికపై జరిగిన అమానుష ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, అదే సమయంలో నిమ్స్ ప్రాంగణంలో మరో బాలికపై లైంగిక దాడి యత్నం జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆసుపత్రి ఆవరణలో భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.






