‘రాకా’ గ్లింప్స్‌పై సూపర్ అప్‌డేట్

by Pulgam srinivas |

ఈ ఆగస్టు నెలలో ‘రాకా’ గ్లింప్స్‌ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

‘రాకా’ గ్లింప్స్‌పై సూపర్ అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి చాలా తక్కువ అప్డేట్స్ వచ్చినప్పటికీ, ‘పుష్ప’ లాంటి భారీ విజయానంతరం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా గ్లింప్స్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ ఆగస్టు నెలలో ‘రాకా’ గ్లింప్స్‌ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ మూవీ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, సినిమాపై అంచనాలు మరింత తారాస్థాయికి చేరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

Next Story