- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపం ప్రతాప్ ఫెయిల్యూర్ కావడానికి కారణం అదే.. షాకింగ్ కామెంట్స్ చేసిన తిరువీర్
‘పాపం ప్రతాప్’ కథ విన్నప్పుడు చాలా ఎక్సైట్ అయ్యానని, కానీ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదని తిరువీర్ తెలిపాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు తిరువీర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కొంతకాలం క్రితం ‘పాపం ప్రతాప్’ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా విడుదలకు ముందు మూవీ అద్భుతంగా ఉంటుందని, ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని తిరువీర్ గట్టి నమ్మకంతో చెప్పుకొచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా తిరువీర్ ‘ఓ.. సుకుమారి’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించాడు.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ విడుదల కార్యక్రమంలో భాగంగా తిరువీర్ పాత్రికేయులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయనకు ‘పాపం ప్రతాప్’ సినిమా కోసం మీరు చాలా కష్టపడ్డారు. మంచి విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో చెప్పారు. కానీ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. దాని గురించి మీరేమంటారు అనే ప్రశ్న ఎదురయింది. దానికి తిరువీర్... కొన్ని సినిమాలు పేపర్ మీద అద్భుతంగా కనిపిస్తాయి.
కానీ అదే స్థాయిలో సినిమా రూపుదిద్దుకోదు. అలాంటి సమస్యల వల్ల కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అవుతాయి. ‘పాపం ప్రతాప్’ విషయంలో కూడా అదే జరిగింది. ఆ సినిమా కథ విన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ సినిమా మాత్రం ఆ స్థాయిలో రాలేదు. అలాగే విడుదలకు ముందు నేను సినిమా చూడలేదు. టీమ్‌ను నమ్మి ప్రమోషన్స్ చేశాను. థియేటర్లలో విడుదలైన తర్వాత సినిమా చూశాను. దానిని ఇంకాస్త బెటర్ చేయవచ్చని నాకు అనిపించింది” అని తిరువీర్ చెప్పుకొచ్చాడు.






