అంబేద్కర్ విగ్రహం పై గుర్తుతెలియని దుండగులు దాడి.. చూపుడు వేలు ధ్వంసం

by Jakkula.Mamatha |

వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహం పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు.

అంబేద్కర్ విగ్రహం పై గుర్తుతెలియని దుండగులు దాడి.. చూపుడు వేలు ధ్వంసం
X

దిశ,వెల్దుర్తి: వెల్దుర్తి మండలం శేరిలా గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహం పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇటీవల గత కొన్ని నెలల క్రితం గ్రామ పాఠశాల సమీపంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహం పై దుండగులు దాడి చేయడంతో అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలు పగిలిపోయింది. తెల్లవారుజామున చూసిన గ్రామస్తులు సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శేరిలా గ్రామం ఇటీవలే కొత్త పంచాయతీ ఏర్పడడం ఎన్నికలు జరగడం కొత్త పాలకవర్గం కొలువుదీరాయి.

పంచాయతీ పాలన పనులు ప్రారంభమయ్యాయి. గత కొద్ది రోజుల ఇదే గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన చల్ల మహేష్ యాదవ్ ట్రాక్టర్ పొలం వద్ద ఉండగా కాలిపోవడం జరిగింది. ఈ సంఘటన మరువక ముందే అంబేద్కర్ విగ్రహం పై దాడి జరగడంతో గ్రామంలో రాజకీయ కక్షలు తెరలేపేందుకు ఎవరైనా వెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారని పలువురు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఇలాంటి సంఘటన జరిగితే ఘర్షణలు జరిగి ఒకరి పైన ఒకరు దాడులు చేసుకొని వర్గ పోరు పెరుగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు అధికారులు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి శాంతి భద్రతల పరిరక్షణకు కౌన్సిలింగ్ ఇవ్వాలని గ్రామంలోని పలువురు కోరుతున్నారు.

Next Story