- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రాహ్మణులకు గుడ్ న్యూస్.. మళ్లీ ఆ శాఖలోకే కార్పొరేషన్..!
బ్రాహ్మణుల సుదీర్ఘ డిమాండ్‌ను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. బ్రహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తామని ఎన్నికలు ముందు హామీ ఇచ్చింది...

దిశ, వెబ్ డెస్క్: బ్రాహ్మణుల సుదీర్ఘ డిమాండ్‌ను కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. బ్రహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొస్తామని ఎన్నికలు ముందు హామీ ఇచ్చింది. దీంతో ఈ మాటలను నిలబెట్టుకుంది. తాజాగా ఉత్తర్వుల జారీ చేసింది.
గత ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖలో బ్రహ్మణ కార్పొరేషన్
కాగా ఎంతో కాలంగా బ్రహ్మణ కార్పొరేషన్‌లోనే కొనసాగిన వారిని జగన్ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకెళ్లింది. దీంతో తమను దేవాదాయ శాఖ కార్పొరేషన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. కానీ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో 2024 ఎన్నికల ముందు కూటమి నాయకులను బ్రాహ్మణులు కలిసి సమస్యను విన్నవించారు. దీంతో తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా సమస్యను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.
దేవాదాయ శాఖలోనే బ్రహ్మణ కార్పొరేషన్
ఈ మేరకు తాజాగా అడుగులు వేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖలోనే ఉంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో బ్రహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తమకు అందాల్సిన సంక్షేమ పథకాలు, దక్కాల్సిన ప్రాధాన్యత దక్కుతుందని బ్రాహ్మణుల ఆనందనం వ్యక్తం చేస్తు్న్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.






