అది చీకటి కుట్ర.. మెగా డీఎస్సీపై జగన్ మరోసారి సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

మెగా డీఎస్సీపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అది మెగా డీఎస్సీ కాదని, మెగా స్కాం(Mega Scam) అని ఆయన అభివర్ణించారు...

అది చీకటి కుట్ర.. మెగా డీఎస్సీపై జగన్ మరోసారి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డీఎస్సీపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy ) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అది మెగా డీఎస్సీ(Mega Dsc) కాదని, మెగా స్కాం(Mega Scam) అని ఆయన అభివర్ణించారు. సీఎం చంద్రబాబు(Cm Chandrabau), మంత్రి నారా లోకేశ్(Minsiter Nara Lokesh) చేసిన చీకటి కుట్ర అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిభవంతుల జీవితాలలో చెలగాటమాడారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలతో లక్షలాది మంది అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి మోసపూరితమైన ఉద్యోగ భర్తీని రాష్ట్రం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. 16 వేల పోస్టుల భర్తీ వారి కాసులు కురిపించిందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను నిర్వర్యం చేశారని వ్యాఖ్యానించారు. డీఎస్సీ అంటే లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలకు నిలయమని, కానీ ప్రభుత్వం అవకతవకలు, అవినీతికి వేదికను చేసిందని జగన్ మండిపడ్డారు.

మాజీ సీఎం జగన్ ట్వీట్

Next Story