- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగార్జున ఆ సినిమాను లైట్ తీసుకున్నాడా?
‘సోగ్గాడే చిన్నినాయన’, ‘బంగార్రాజు’లకి కొనసాగింపుగా తెరకెక్కాల్సిన సీక్వెల్‌ను నాగ్ పక్కనపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కింగ్ నాగార్జున కొన్ని సంవత్సరాల క్రితం ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా నాగార్జున, నాగచైతన్య హీరోలుగా, రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మూవీ 2022 సంక్రాంతి సందర్భంగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇక ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ చిత్రాలకు సీక్వెల్‌గా మరో సినిమాను రూపొందించనున్నట్లు, దానికి కూడా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి గతంలో ప్రకటన వెలువడింది.
అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికే ఈ ఏడాది సగం పూర్తవగా, సంక్రాంతికి కూడా ఎక్కువ సమయం లేకపోయినా ఇప్పటివరకు నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం నాగార్జున, రా కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తన 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్‌పైనే ఆయన పూర్తి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాను ప్రస్తుతానికి నాగార్జున పక్కన పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.






