బయ్యారం గట్టు ముసలమ్మ ఆలయంలో కలకలం.. హుండీల ధ్వంసం

by Jakkula.Mamatha |

మండలంలోని బయ్యారం నుంచి రామచంద్రపురం ప్రధాన రహదారిపై గట్టు ముసలమ్మ దేవాలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని గేట్లు తాళాలను పగులగొట్టి గర్భగుడి ప్రాంగణంలోని హుండీలను బయటకు తీసుకువచ్చి వాటిని ధ్వంసం చేసినట్లు సమాచారం.

బయ్యారం గట్టు ముసలమ్మ ఆలయంలో కలకలం.. హుండీల ధ్వంసం
X

దిశ,బయ్యారం: మండలంలోని బయ్యారం నుంచి రామచంద్రపురం ప్రధాన రహదారిపై గట్టు ముసలమ్మ దేవాలయంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోని గేట్లు తాళాలను పగులగొట్టి గర్భగుడి ప్రాంగణంలోని హుండీలను బయటకు తీసుకువచ్చి వాటిని ధ్వంసం చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లిన వారు ఆలయంలోకి దర్శనం కోసం వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఆకతాయిలు మద్యం మత్తులో ఉన్న వారే హుండీలు పగలగొట్టి వాటిలో నగదును కాజేసేందుకు ఇలాంటి పనులు చేసినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. హుండీలో నగదు ఎంత మేర తస్కరణకు గురైందో.. ఆలయ కమిటీ ద్వారా సమాచారం తెలియాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. అవి పనిచేస్తున్నాయో.. లేదో తెలియాల్సి ఉంది. ఆలయంలో దొంగతనం విషయం తెలుసుకున్న ఎస్సై ప్రశాంత్ బాబు, సీఐ రవీందర్ సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. దీనిపై ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Next Story