- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరికొద్ది సేపట్లో IND vs AFG.. అరంగేట్రం మ్యాచ్ ముందు క్రికెటర్ తండ్రి కన్నుమూత
by Malleboina Mahesh |
భారత్‌తో తొలి వన్డేకు ముందే అఫ్గాన్ జట్టులో విషాదం చోటుచేసుకుంది. తండ్రి హఠాన్మరణంతో ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్ డార్విష్ రసూలీ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

X
దిశ, వెబ్ డెస్క్: మరికొద్ది సేపట్లో ధర్మశాల వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ యువ బ్యాటర్ డార్విష్ రసూలీ (Darwish Rasooli) తండ్రి హఠాన్మరణం చెందినట్లు సమాచారం వచ్చింది. దీంతో ఆయన మ్యాచ్‌కు కొన్ని గంటల ముందే స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. ఈ విషయాన్ని ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అధికారికంగా ధృవీకరించారు. ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేలో రసూలీ వన్డే అరంగేట్రం (ODI Debut) చేయాల్సి ఉండగా.. అంతలోనే ఈ విషాద సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, జూన్ 17న లఖ్‌నవూలో జరిగే రెండో వన్డే సమయానికి ఆయన తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉందని మేనేజ్‌మెంట్ తెలిపింది.
Next Story






