- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సగం సినిమా అయ్యేసరికే బడ్జెట్ అయిపోయింది.. ప్రభాస్ మూవీపై నిర్మాతల షాకింగ్ కామెంట్స్
‘రెబెల్’ సినిమా సగం పూర్తయ్యేలోపే అనుకున్న బడ్జెట్ అయిపోయిందని నిర్మాతలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరోగా కొన్ని సంవత్సరాల క్రితం తెరకెక్కిన ‘రెబెల్’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ చిత్రం భారీ అంచనాల నడుమ 2012లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా నిర్మాతలు భగవాన్, పుల్లారావు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘రెబెల్’ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా “రాఘవ లారెన్స్‌పై మీకు కోపం ఉందా? లేకఇష్టం ఉందా?” అనే ప్రశ్న ఎదురైంది.
దీనికి నిర్మాతలు స్పందిస్తూ, “ఆ సమయంలో మాకు లారెన్స్ గారిపై కొంత కోపం వచ్చింది. సినిమా ప్రారంభ సమయంలో ఒక నిర్దిష్ట ఖర్చులో సినిమాను పూర్తి చేస్తానని చెప్పారు. అందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. కానీ సినిమా సగం పూర్తయ్యేలోపే మేము అనుకున్న మొత్తం బడ్జెట్ అయిపోయింది” అని తెలిపారు. అయితే అన్ని జరిగినా లారెన్స్ గారు ఎక్కడా రాజీ పడలేదు. ఆయన అనుకున్నట్టుగానే సినిమాను తెరకెక్కించారు. మేము కూడా సినిమా ప్రారంభించినప్పుడు ఎంత సానుకూలంగా ఉన్నామో, ఖర్చు పెరిగినా అదే నమ్మకంతో కొనసాగాం. సినిమా వల్ల నష్టాలు వస్తాయని ముందే అర్థమైంది. అయినప్పటికీ మేము బాధపడలేదు. ఈ మొత్తం సమయంలో ప్రభాస్ మాకు ఎంతో సహాయం చేశాడు అని నిర్మాతలు వెల్లడించారు.






