- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ మృతి
రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ అల్ ఖాఖా విన్యాసాలు చేస్తూనే ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. యెమెన్ లోని డామ్ట్ ప్రాంతంలో 120 మీటర్ల హరధాత్ దమ్త్ అగ్నిపర్వత బిలాన్ని ఎక్కుతుండగా వేడినీటిలో పడిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ అల్ ఖాఖా విన్యాసాలు చేస్తూనే ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. యెమెన్ లోని డామ్ట్ ప్రాంతంలో 120 మీటర్ల హరధాత్ దమ్త్ అగ్నిపర్వత బిలాన్ని ఎక్కుతుండగా వేడినీటిలో పడిపోయాడు. సోషల్ మీడియాలో పెట్టేందుకు వీడియోలు షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. గతంలో ఈ పర్వతాలను అల్ ఖాఖా అవలీలగా ఎక్కేసేవాడు. కానీ ఈసారి కొండలపై విన్యాసాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా కాలు జారింది. పడిపోతున్న సమయంలో వేరే చోట పట్టుకుందామని ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది.
నీటి గుండంలో నీరు వేడిగా, ఎక్కువ లోతుగా ఉండటంతో మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది గంటల తరబడి కష్టపడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే అల్ ఖాకా ఎలాంటి పరికరాలు లేకుండా ఈజీగా పర్వతాలను ఎక్కుతూ సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈయనకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండటంతో పాటు విదేశాల్లోనూ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అల్ ఖాఖా విన్యాసలకు ఫిదా అయిన నెటిజన్లు ఆయనను యెమెన్ స్పైడర్ మ్యాన్ అని పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తి మరణించడంతో సోషల్ మీడియాలో అభిమానులు, ఫాలోవర్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.






