- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా గడపడం నా ఫాంటసీ.. హైదరాబాద్‌లో పైలట్‌కు జిమ్ ట్రైనర్ వేధింపులు
జిమ్ కు వచ్చే కస్టమర్ పై మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని సనత్ నగర్ లో చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లో ఉన్న కల్ట్ జిమ్‌లో మార్చి నెలలో పైలెట్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ యువతి చేరింది.

దిశ, వెబ్ డెస్క్: జిమ్ కు వచ్చే కస్టమర్ పై మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని సనత్ నగర్ లో చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లో ఉన్న కల్ట్ జిమ్‌లో మార్చి నెలలో పైలెట్‌గా ఉద్యోగం చేస్తున్న ఓ యువతి చేరింది. అయితే అందులో మేనేజర్, ట్రైనర్‌గా పని చేసే సంతోష్ గౌడ్ ఆమెను పరిచయం చేసుకుని ఆ తరవాత వేధింపులకు పాల్పుడూ లోబర్చుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. జిమ్ లో తనను సంతోష్ గౌడ్, అతడి ప్రియురాలు రజిని వేధిస్తున్నారని చెప్పింది.
జిమ్ లో చేరిన తరవాత ప్రతిరోజు పలకరిస్తూ ఆ తరవాత వేధించడం మొదలు పెట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇన్ స్టాగ్రామ్ లో అసభ్యంగా మెసేజ్ లు పంపుతున్నాడని తెలిపింది. తాను మాట్లాడకపోయినా జిమ్ లో, పార్కింట్ సంతోష్ గౌడ్, అతడి గర్ల్ ఫ్రెండ్ వెంటపడుతూ వేధిస్తున్నారని చెప్పింది. ఇద్దరితో ఒకేసారి కలిసి ఉండటంతో సంతోష్ ఫాంటసీ అని రజిని తనకు మెసేజ్ లు పెడుతోందని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






