- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో దంచికొట్టిన భారీ వర్షాలు.. కేశంపేటలో అత్యధికంగా 97.5 మి.మీ వర్షపాతం నమోదు!
తెలంగాణలో నిన్న రాత్రి భారీ వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో అత్యధికంగా 97.5 మి.మీ, షాబాద్‌లో 91.5 మి.మీ వర్షపాతం నమోదు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం భారీ వర్షాలు దంచికొట్టాయి. దీంతో అనేక ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా గాలివాన కారణంగా అనేక ప్రాంతాల్లో చెట్లు విరిగిపడి కరెంట్, రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఇదిలా ఉంటే నిన్నటి వర్షపాతంతో వాతావరణ శాఖ కీలక విషయాలను ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర జిల్లాలు, ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది.
రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ అధికారిక గణాంకాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో అత్యధికంగా 97.5 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. దీని తర్వాత అదే జిల్లాలోని షాబాద్ మండలం తాళ్లపల్లిలో 91.5 మి.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 91.0 మి.మీ, నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో 85.8 మి.మీ వర్షపాతం రికార్డైంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఏఆర్ఎస్ ప్రాంతంలో 80.8 మి.మీ, షాబాద్‌లో 79.0 మి.మీ, వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం జానంపేటలో 77.8 మి.మీ చొప్పున వర్షం కురిసి లోతట్టు ప్రాంతాలను జలమయం చేసింది.
రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షం ఉధృతి కొనసాగింది. జగిత్యాల జిల్లా వెల్గటూరులో 74.0 మి.మీ, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో 72.3 మి.మీ, జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరులో 71.3 మి.మీ వర్షపాతం నమోదైంది. మహబూబా నగర్ జిల్లా గండీడ్ (సల్కర్‌పేట)లో 69.5 మి.మీ, వికారాబాద్ జిల్లా పరిగిలో 69.0 మి.మీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక (చీకోడు)లో 66.8 మి.మీ, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమెరిలో 66.5 మి.మీ చొప్పున వర్షం రికార్డయింది. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని పలు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రాజేంద్రనగర్ శివరాంపల్లి పరిసరాల్లో 60.0 మి.మీ, మైలార్‌దేవ్‌పల్లి సబ్‌స్టేషన్ వద్ద 56.8 మి.మీ, గోల్కొండలో 50.0 మి.మీ, బహదూర్‌పురా కిషన్‌బాగ్ ప్రభుత్వ పాఠశాల ప్రాంతంలో 49.0 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ అకస్మాత్తు వర్షాలతో నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపించగా, రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.






