- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు అన్నదమ్ములకు తీవ్ర గాయాలు
మద్యం మత్తులో కారు డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

దిశ, మీర్ పేట్: మద్యం మత్తులో కారు డ్రైవర్ ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలైన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలా నగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు అఖిలేశ్వర్(22), విగ్నేశ్వర్(16) లు పాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. మిథులా నగర్ నుంచి షాపుల్లో పాలు వేయడానికి బైక్ పై వెళుతుండగా వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని టిజి08ఎ7887 వాహనం ఢీకొట్టింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం కారు కిందకి దూసుకెళ్లింది. ద్విచక్ర వాహనంలోని ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు కారులో బీరు బాటిల్స్ సైతం ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






