- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss 10 అగ్నిపరీక్ష షురూ.. సామాన్యులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన నాగార్జున
ఈసారి ఆట మరింత ఇంట్రెస్టింగ్‌గా, కఠినంగా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సామాన్యులకు సెలబ్రిటీలతో పోటీ పడేందుకు సమాన అవకాశం కల్పిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు.

దిశ, సినిమా: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగులో సరికొత్త మైలురాయిని అందుకోబోతోంది. ఇప్పటికే విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు ప్రతిష్టాత్మక పదో సీజన్‌కు సిద్ధమైంది. ఈ సీజన్ కోసం నిర్వాహకులు బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు హౌస్‌లోకి ప్రవేశించే గోల్డెన్ ఛాన్స్‌ను ఇస్తూ ఒక అధికారిక ప్రోమోను విడుదల చేశారు. గత ఎన్నో సీజన్లుగా తనదైన స్టైల్‌లో షోను నడిపిస్తున్న కింగ్ అక్కినేని నాగార్జున ఈ పదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఈసారి ఆట మరింత ఇంట్రెస్టింగ్‌గా, కఠినంగా ఉండబోతోందని హింట్ ఇచ్చారు. గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సామాన్యులకు సెలబ్రిటీలతో పోటీ పడేందుకు సమాన అవకాశం కల్పిస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు.
అందుకు తొమ్మిది సీజన్లో పెట్టినట్లుగా అగ్నిపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 12 నుంచి 20వరకు అడిషన్‌కు వీడియోలు పంపవచ్చని నాగార్జున ప్రకటించారు. ఈ వీడియోలు కనీసం మూడు నిమిషాల వరకు ఉండవచ్చని అన్నారు. రికార్డ్ చేసిన వీడియోలనుhttps://bbtelugu.jiostar.com సైట్‌లో అప్‌లోడ్ చేయాలని చెప్పారు. ఇంకేందుకు ఆలస్యం ఆసక్తి ఉన్నవారు మీ టాలెంట్‌ను బయటకు తీసి వీడియోలను పంపి బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలతో పోటీ పడేందుకు చాన్స్ దక్కించుకోండి. కేవలం ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉండటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీలుగా మారాలనుకునే వారు వెంటనే అప్లై చేసుకోవాలని మేకర్స్ సూచించారు. ఈసారి స్టార్ మాతో పాటు ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ భాగస్వామ్యంతో ఈ షో మరింత గ్రాండ్‌గా డిజైన్ చేయబడింది.






