నడిరోడ్డుపై రిటైర్డ్ ఎస్సైకి ఊహించని షాక్.. రెండు తులాల గొలుసు మాయం!

by Jakkula.Mamatha |

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది.

నడిరోడ్డుపై రిటైర్డ్ ఎస్సైకి ఊహించని షాక్.. రెండు తులాల గొలుసు మాయం!
X

దిశ,మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. రిటైర్డ్ ఎస్సై మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. స్థానికుల కథనం ప్రకారం.. పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ ఇంటి చిరునామా అడుగుతున్నట్లు నటించారు. ఈ క్రమంలో రిటైర్డ్ ఎస్‌ఐతో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వేగంగా పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story