- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లోయలో పడి ఎనిమిది మంది మృతి
నేపాల్‌లోని కావ్రేపలాంచోక్ జిల్లా బి.పి. హైవేపై ప్రయాణికుల బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందారు, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన నేపాల్‌లోని కావ్రేపలాంచోక్ (Kavrepalanchok) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 24 మంది ప్రయాణికులతో కొండ ప్రాంత రహదారిపై వెళ్తున్న ఒక ప్రయాణికుల బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి.. దాదాపు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగిలిన 16 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బనేపా నుంచి రోషి గ్రామీణ మున్సిపాలిటీకి వెళ్తున్న బస్సు, బి.పి. హైవేపై (BP Highway) నమోబుద్ధ మున్సిపాలిటీ-2 పరిధిలోని బుచ్చాకోట్ (సెల్ఫీ దండా) సమీపంలో ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బృందాలు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను రక్షించి చికిత్స నిమిత్తం ధులిఖెల్ ఆసుపత్రికి తరలించారు. స్టీరింగ్ సరిగ్గా పనిచేయకపోవడం, టైర్ పేలి పోవడం వల్లనే డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై నేపాల్ ప్రధాన మంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించింది.






