- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రమాదం జరిగితే కానీ స్పందించరా?’.. ముప్పిరెడ్డిపల్లి గ్రామస్తుల ఆగ్రహం
by Jakkula.Mamatha |
ఎక్కడ పడితే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్డు తవ్వి నెల రోజుల మీద గడుస్తున్న గుత్తేదారి నిర్లక్ష్యం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, తూప్రాన్: ఎక్కడ పడితే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్డు తవ్వి నెల రోజుల మీద గడుస్తున్న గుత్తేదారి నిర్లక్ష్యం పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో గత నెల రోజుల క్రితం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం సీసీ రోడ్డు తవ్వి గుంతలు చేశారు. పని పూర్తి చేయడం వదిలేసి నెల గడుస్తున్న ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టుగా ప్రవర్తించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు గుంతలో నీరు నిండి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో చీకట్లో ప్రమాదాలు జరగడం విష పూరిత కీటకాలు రావడం జరుగుతుందని తెలిపారు. వెంటనే పాలకవర్గం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






