‘రావ్ బహదూర్’ను ఏకంగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో పోల్చిన సత్యదేవ్

by Pulgam srinivas |

బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ స్థాయిలో గుర్తుండిపోయే సినిమా ‘రావ్ బహదూర్’ అవుతుందని సత్యదేవ్ ధీమా వ్యక్తం చేశాడు.

‘రావ్ బహదూర్’ను ఏకంగా ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో పోల్చిన సత్యదేవ్
X

దిశ, వెబ్ డెస్క్: సత్యదేవ్ హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ‘రావ్ బహదూర్’ సినిమా జూన్ 3వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్న మూవీ బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో సత్యదేవ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సత్యదేవ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుంటారు. మలయాళంలో మంచి సినిమా వచ్చినా, ఇంగ్లీష్ లేదా తమిళంలో మంచి కంటెంట్ వచ్చినా మన ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి ఆదరిస్తుంటారు.

జూన్ 3న మా ‘రావ్ బహదూర్’ సినిమా విడుదల అవుతోంది. మనం ఇతర భాషల సినిమాలను ఎలా ఆదరిస్తామో, ఇతర ప్రాంతాల ప్రేక్షకులు కూడా మా సినిమాను అదే స్థాయిలో ఆదరిస్తారని నమ్ముతున్నాం అని తెలిపారు. అంతేకాకుండా తెలుగులో గొప్ప సినిమాలు అంటే ఇప్పటి వరకు బాహుబలి, ఆర్ఆర్ఆర్ పేర్లు చెబుతుంటారు. ఇకపై ‘రావ్ బహదూర్’ పేరు కూడా ఆ జాబితాలో చేరుతుంది. ఆ స్థాయిలో ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ఉందిని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన ఈ కామెంట్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Next Story